విదేశాల నుంచి చీతాలను మన దేశానికి తీసుకురావడంతో వీటిపై మన దేశంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదిలావుంటే 1948లో ఉమ్మడి మధ్యప్రదేశ్‌లోని కొరియా జిల్లాలో (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది) చివరి చీతా చనిపోయింది. ఆ తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. 1952లో కేంద్ర ప్రభుత్వం వీటిని అంతరించిన జాతిగా ప్రకటించింది. దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని పునః ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ను చేపట్టింది. వచ్చే పదేళ్ల వరకు ఏటా 12 చీతాలను దేశంలోకి దిగుమతి చేసుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.
‘చీతా’ (అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది. ‘మచ్చలు కలిగినది’ అని దీని అర్థం. చీతాలు గంటకు 114 కి.మీ. గరిష్ట వేగంతో పరుగెత్తుతాయి. తరచూ 80 కీ.మీ. నుంచి 100 కీ.మీ. వేగంతో పరుగెత్తుతుంటాయి. వేటాడేటప్పుడు అనూహ్యంగా ఇవి తమ వేగాన్ని పెంచుకుంటాయి. చీతాలకు పొడవైన కాళ్లు, పొడవైన శరీరం ఉంటుంది. భుజాల భాగంలో అవి 75 సెం.మీ. గరష్ట పొడవు ఉంటాయి. వీటి బరువు 34 కిలోల నుంచి 54 కేజీల వరకు ఉంటుంది. ఈ చీతాల రాకతో భారత్‌లో బహిరంగ అడవులు, మైదాన ప్రాంతాల్లో పర్యావరణ వ్యవస్థ సమతౌల్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అటవీ సంపదను సంరంక్షించేదుకు, జల సంరక్షణకు ఇవి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు. చీతాల జాతిలో సుమారు 100 రకాలు ఉన్నాయి. చీతాలు, లెపార్డ్, జాగ్వార్ వీటిలో ప్రధానమైనవి. చీతాలతో పోలిస్తే.. లెపార్డ్, జాగ్వార్‌లో బరువు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో ప్రస్తుతం 17 దేశాల్లో చీతాలు ఉన్నాయి. భారత్‌తో కలిపి ఇకపై ఈ జీవులున్న దేశాలు 18 అవుతాయి.