కడప డీసీసీ ప్రెసిడెంట్ గా వున్న నీలి శ్రీనివాసరావుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పారు. తనకు డీఎస్సీ 1998లో ఉద్యోగం వచ్చిందని.. పార్టీ పెద్దలకు చెప్పి మరీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు టీచర్ ఉద్యోగం ఒక కల అని.. రిటైర్మెంట్ తర్వాత ఒకవేళ ఓపిక ఉంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ తన సేవల్ని అందిస్తాను అంటున్నారు నీలి శ్రీనివాసరావు. కడప జిల్లాకు చెందిన రాజకీయ నేతకు టీచర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే తన పదవితో పాటూ పార్టీకి రాజీనామా చేశారు.. త్వరలోనే ఉద్యోగంలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. టీచర్ కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీపై అభిమానం ఉన్నా సరే ఆయన ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పేందుకే మొగ్గు చూపారు.
అమెజాన్‌లో ఏప్రిల్ 14 నుంచి 17 వరకు బ్లాక్ బస్టర్ వేల్యూ డేస్ | కిచెన్, సమ్మర్, గృహోపకరణాలపై భారీ తగ్గింపు ధరలు
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తనకు డీఎస్సీ-98లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తనను ఉద్యోగంలో నియమిస్తూ ఆదేశాలిచ్చిందని.. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు తన రాజీనామా లేఖను పంపించారు.
1998లో డీఎస్సీ పరీక్షలు రాశానని.. అప్పట్లో క్యాలిఫై అయ్యానని.. కానీ కొన్ని కారణాలతో నియామకాలు జరగలేదన్నారు. అందుకే వెంటనే కోర్టును ఆశ్రయించామని.. ఇప్పుడు ఆ చిక్కలన్నీ తొలగి తనకు ఉద్యోగం వచ్చిందన్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలం దిగువపేట స్కూల్‌లో టీచర్‌గా నియమితులైనట్లు చెప్పారు. తనకు ఉద్యోగం వచ్చిన విషయాన్ని పార్టీ పెద్దలకు ఫోన్ ద్వారా తెలియజేశాను అన్నారు.
రెండున్నరేళ్లగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని.. తనకు అందరూ పార్టీలోని నేతలందరూ సహకరించారన్నారు. తనకుసహకరించిన పార్టీ పెద్దలకు, తోటి నాయకులకు, కార్యకర్తలతో పాటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీపై అభిమానం ఉందని.. కానీ ఉపాధ్యాయుడు కావాలన్నది తన కల అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. తన ఉద్యోగ విరమణ తర్వాత ఆరోగ్యం సహకరిస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తానని చెప్పడం విశేషం.