కాంగ్రెస్ నేతృత్వంలోని సుఖ్‌విందర్ సింగ్ ప్రభుత్వం సామాన్యులకు సేవ చేయాలనే అజెండాతో ముందుకు సాగుతోందని హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి ఆదివారం అన్నారు.ఉనాలోని పంజావర్‌లో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు సేవ చేయాలనే అజెండాతో ముందుకు సాగుతోంది. ప్రజా సంక్షేమ పనులను పూర్తి నిబద్ధతతో పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపిన స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పండోగా నుంచి పంజావర్ వరకు రోడ్డు కోసం సుమారు రూ.13 కోట్లు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పంజావర్‌లో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.పంజావర్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గొట్టపు బావులు, తాగునీటి పథకాల డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.ఉనా జిల్లాలో గొట్టపు బావుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.11 కోట్లు విడుదల చేశామన్నారు. స్థానికంగా పలు అభివృద్ధి పనులకు రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి ప్రకటించారు.