తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ముగ్గురు ప్రభుత్వ అధికారులు సహా నలుగురికి గాయాలయ్యాయి. ప్రభుత్వ అధికారులు పటాకుల ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించారని పోలీసులు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం కెలమంగళంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ముగ్గురు అధికారులు ఫ్యాక్టరీని తనిఖీ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని, ముగ్గురు ప్రభుత్వ అధికారులు మరియు గోడౌన్ మేనేజర్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రత్యేక జిల్లా రెవెన్యూ అధికారి బాలాజీ, గోడౌన్ మేనేజర్‌కు తీవ్ర గాయాలయ్యాయని, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.