ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌కు పబ్జీలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమె పాకిస్థాన్‌లోని తన ఇంటిని విక్రయించి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్‌కు అక్రమ మార్గంలో చేరుకుంది. అయితే వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయం ఇటీవల రెండు దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓ బాలీవుడ్ డైరెక్టర్ సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించి సీమా హైదర్, సచిన్ మీనాతో కలిసి ఆడిషన్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం విడుదల కావడంతో వైరల్‌గా మారింది.
సీమా హైదర్, సచిన్ మీనాల పబ్జీ ప్రేమ.. ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమిత్ జానీ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు కరాచీ టు నోయిడా అనే పేరు కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన రాగా.. పోస్టర్ కూడా విడుదల అయింది. అయితే ఈ సినిమాలో మొదట సీమా హైదర్ పాత్ర పోషించేందుకు ముందు ఆమెను చిత్ర బృందం సంప్రదించింది. అయితే కొన్ని కారణాల వల్ల సీమా హైదర్ ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదు. అయితే ఈ సినిమాలో నటిస్తే చంపేస్తామని ఆమెకు బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో కరాచీ టు నోయిడా లవ్‌స్టోరీ సినిమాలో సీమా హైదర్ పాత్ర చేసేందుకు ఆమె పోలికలతో ఉన్న నటిని దొరకబట్టారు. దీంతో ఆమెకు సంబంధించి ఆడిషన్స్ నిర్వహించారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఈ ఏడాదిలోనే థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే సీమా హైదర్‌కు ఇప్పటికే సినిమా ఆఫర్ వచ్చింది. "ఎ టైలర్ మర్డర్ స్టోరీ" అనే సినిమాలో ఆమె రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ - రా ఏజెంట్‌గా కనిపించనుంది. దీనికి సంబంధించి సినిమా డైరెక్టర్లు జయంత్ సిన్హా, భరత్ సింగ్‌లు ఇప్పటికే సీమా హైదర్ వద్దకు వెళ్లి మాట్లాడారు. సీమా హైదర్‌కు ఆడిషన్ కూడా నిర్వహించారు.
సచిన్ మీనా కోసం పాక్ నుంచి నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ నేపాల్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జంట ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా కొత్త ఇంటికి మారిన తర్వాత సచిన్, సీమా దంపతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల మీడియాకు వెల్లడించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే వారిద్దరినీ సినీ దర్శకులు సంప్రదించడం గమనార్హం. మరోవైపు సీమా హైదర్ కేసులో ఇప్పటికీ సందిగ్ధం వీడటం లేదు. సరైన ఆధారాలు లేకుండా సీమా హైదర్ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిందని గుర్తించారు. అయితే ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపిస్తే అక్కడ ఆమెను హత్య చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మానవీయ కోణంలో ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.