శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడనున్నాయి. ఆర్టికల్ 35-ఎపై కేంద్రం తన వైఖరిని వెల్లడించే వరకూ స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa