రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ ఎదుట సెల్ఫీ తీసుకొని దాచుకోవాలని, వైసీపీకి ఇవే చివరి ఎన్నికలని టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా శిరివెళ్ల మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో శుక్రవారం పర్యటించి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని అన్నారు. ప్రజల అండతో గెలుపొంది వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా ల్సిన ఎమ్మెల్యేలు ఓటమి భయంతో అసెంబ్లీలోకి సైతం అడుగు పెట్టలేక పోవడంతో ఏకంగా అసెంబ్లీని వాయిదా వేయాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏ ప్రజా సమస్యలపై మాట్లాడారో, నియోజకవర్గ అభివృద్ధికి ఏం కృషి చేశారో ప్రజలకు తెలియాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రామాల్లో హడావుడిగా రోడ్లు వేసి భారీ ఎత్తున శిలాఫలకాలు ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు అధికార బలంతో ప్రజలకు చేసిన అన్యాయాలు, కబ్జాలు, దౌర్జ న్యాలను గుర్తు పెట్టుకుంటారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కమతం జయరామిరెడ్డి, కమతం లక్ష్మిరెడ్డి, పుల్లా రెడ్డి, సత్తారు లక్ష్మిరెడ్డి, సుబ్బారెడ్డి, మురళీ, శీలం లక్ష్మిప్రసాదు, తాళ్లూరి బుగ్గన్న, యామా గుర్రప్ప, సూరా రామ, బాలచంద్రుడు, రవి, రామ్మో హన్, శ్రీరాములు, ఉల్లి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.