మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.ఇదే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9న కొట్టివేసింది. కేజ్రీవాల్ కస్టడీ రేపటితో ముగియనుండగా, ఈడీ అధికారులు ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.