మైదుకూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేస్తున్న ప్రజాఉద్యమ నేత, రైతునాయకులు ఏ. వీ రమణకు ఎన్నికల అధికారులు తోపుడు బండి గుర్తును కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం రైతు నాయకులతో కలిసి మైదుకూరులో ప్రచారం నిర్వహించారు. మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికై తోపుడు బండి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విన్నవించారు. ఈ కార్యక్రమంలో రైతునాయకులు రామ్మోహన్, పుష్పరాజ్, గురుప్రసాద్, నరసింహ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa