మా అబ్బాయి అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేశాడు. చంద్రబాబూ, నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్ అయిన భూములు ఎవరైనా కొంటారా? అని మాజీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ..... నా మీద కక్ష తీర్చుకోవాలంటే తీర్చుకోండి. దయచేసి ఆలోచించుకోండి. ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇలా కక్ష రాజకీయాలు, దుర్మార్గాలకు ఒడిగట్టొద్దు. రెడ్ బుక్ రాజ్యాంగం మాపై ఎందుకు అమలు చేస్తున్నారు?. ఇప్పటికైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయండి. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి అని హెచ్చరించారు.