ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1631.93 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 50,593 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 36,799 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 101.500 టీఎంసీలుగా నమోదు అయ్యింది.