ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్ని రకాల స్కామ్‌లా? ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ బ్యాంక్ అకౌంట్ గుల్ల.. బీ కేర్‌ఫుల్!

business |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 09:01 PM

 ఎవరో ఎక్కడుంటారో తెలియదు. కంటికి కనిపించకుండానే డబ్బుల్ని దోచేస్తారు. వాళ్ల ట్రిక్స్‌‌కు ఇట్టే వారి వలలో పడిపోవాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లు మనల్ని లోబర్చుకున్నట్లే అనుకోండి. ఇదంతా దేని గురించి అని అనుకుంటున్నారా. అదే సైబర్ క్రైమ్స్ గురించి. దేశంలో ఇటీవలి కాలంలో కొత్త కొత్త మోసాలు వెలుగుచూస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా అంతా దీని బాధితులుగా మారుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఇదంతా ముఖ్యంగా డబ్బులు దోచుకునేందుకు కాబట్టి.. బ్యాంక్ అకౌంట్ల చుట్టూనే తిరుగుతుంటుంది. ఇందుకు ముఖ్యంగా బ్యాంకులు కూడా బాధితులవుతుంటాయని చెప్పొచ్చు. అందుకే.. ఇటీవల కస్టమర్లు మోసపోకుండా ఉండేందుకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని అలర్ట్ చేసింది. కస్టమర్లను ఉచ్చులో బిగించేందుకు.. ఎలాంటి స్కామ్స్ ఉండొచ్చో వివరించింది. అవేంటో చూద్దాం.


ట్రాయ్ ఫోన్ స్కామ్- కేవైసీ నిబంధనల్ని పాటించలేదనో లేదా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారన్న కారణంతో మీ మొబైల్ సర్వీసులు నిలిపివేస్తున్నామంటూ మోసగాళ్లు కాల్స్ చేస్తుంటారు. అయితే ట్రాయ్ ఎప్పుడూ మొబైల్ సర్వీసుల్ని నిలిపివేయదు. టెలికాం కంపెనీలకు మాత్రమే ఆ అధికారం ఉంది.


పార్సిల్స్- కస్టమ్స్ దగ్గర మీ పార్సిల్ పట్టుబడిందని.. అందులో అక్రమంగా తరలిస్తున్న వస్తువుల్ని కనుగొన్నట్లు కాల్ చేస్తారు. ఈ ఇష్యూ పరిష్కారం కోసం డబ్బులు డిమాండ్ చేస్తారు. అయితే.. ఇలా పార్సిల్ స్ట్రక్ అయిందని మీకు కాల్స్ వస్తే వెంటనే ఆ నంబర్‌ను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.


డిజిటల్ అరెస్ట్- ఇది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ నకిలీ పోలీసు అధికారుల్లా వ్యవహరిస్తారు. కృత్రిమంగా సృష్టించిన క్రిమినల్ కార్యకలాపాల గురించి ఆన్‌లైన్‌లో విచారించినట్లు ఉంటుంది. అయితే వాస్తవ రూపంలో చూస్తే.. పోలీసులు డిజిటల్ అరెస్టులు చేయరు. ఆన్‌లైన్ విచారణలు జరపరు.


కుటుంబ సభ్యుల అరెస్ట్- ఇక్కడ మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల్ని అరెస్ట్ చేశామంటూ .. వారిని విడుదల చేయాలంటే డబ్బులు చెల్లించాలని అడుగుతారు. ఇలాంటి కాల్స్ వస్తే.. ముందుగా మీ కుటుంబ సభ్యుల్నో.. బంధువుల్నో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ట్రేడింగ్- కొన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ రిటర్న్స్ పొందొచ్చని సోషల్ మీడియాల్లో యాడ్స్ కనిపిస్తుంటాయి. వీటి ఉచ్చుల్లో పడకండి. చాలా వరకు హై రిటర్న్స్ వస్తాయని చెప్పింది స్కామ్‌కు దారి తీయొచ్చు.


ఆన్‌లైన్ జాబ్స్ ఈజీ టాస్క్స్- కొన్ని సార్లు చిన్న చిన్న టాస్క్స్ కంప్లీట్ చేస్తే భారీ జీతం ఇస్తామని ఆన్‌లైన్ జాబ్స్ ఆఫర్ చేస్తుంటారు. దీని కోసం ముందుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్ చేయమంటారు. ఇలాంటివి కూడా స్కా్మ్స్ కిందికే వస్తాయని గుర్తుంచుకోవాలి. లాటరీ- మీరు లాటరీ గెల్చుకున్నట్లు నేరుగా ఇ- మెయిల్ లేదా మొబైల్‌కు ఎస్ఎంఎస్ రావొచ్చు. ఇక్కడ కూడా అది మీకు రావాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చేయమనడం లేదా అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంటారు. ఇవి కూడా దాదాపు స్కామ్స్ కిందికే వస్తాయి.


ఫేక్ ట్రాన్సాక్షన్స్- పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని.. రీఫండ్ చేయాలని కోరతారు. దీనిని పంపేముందు మీ అకౌంట్ నుంచి సదరు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌‌ఫర్ అయ్యాయో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ- మీ కేవైసీ ఎక్స్‌పైర్ అయిందని.. దీనిని అప్డేట్ చేసుకోవాలని ఫోన్ కాల్ ద్వారా లేదా లింక్స్ పంపించడం ద్వారా అడుగుతుంటారు. బ్యాంకులు ఇలా కాల్ చేయడం లేదా లింక్స్ పంపడం దాదాపు జరక్కపోవచ్చు. టాక్స్ రీఫండ్- పన్ను అధికారులమని చెబుతూ బ్యాంక్ డీటెయిల్స్ అడిగేవారూ ఉంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. టాక్స్ డిపార్ట్‌మెంట్ నేరుగా ఎప్పుడూ కాల్స్ చేయదు. బ్యాంక్ వివరాలు అడగదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com