గన్నవరం మండలం కేసరపల్లిలో ఆదివారం మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావు అధ్వర్యంలో డా. బాబూ జగజీవనరావు నగర్‌లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది.
భారీ స్థాయిలో సభ్యత్వాలు నమోదు అయ్యాయి. కార్యక్రమంలో గన్నవరం మండలం ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి కొడాలి రాజేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు పలగాని బాలకృష్ణ, టిడిపి నాయకులు జంపన బుజ్జి, కొడాలి వర ప్రసాద్, న్యాయవాది గురింతపల్లి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.