టీమిండియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్ హార్దిక పాండ్యాతో బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా డేటింగ్‌లో ఉన్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ముంబయి మ్యాచ్ అనంతరం హార్దిక్‌తో కలిసి జాస్మిన్ టీమ్ బస్సులో వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ అఫీషియల్ అయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హార్దిక్ పాండ్యా అతని మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ 2024 జులైలో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఈ జంట జులై 20న ఉమ్మడి ప్రకటన చేసింది. ఆ తర్వాత జాస్మిన్ వాలియాతో పాండ్యా ప్రేమాయణం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |