పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసు అనేక మలుపులు తిరుగుతూ రాష్ట్ర రాజకీయాన్నే కుదిపేస్తున్నది. ఈ కేసు తాజా కీలక మలుపు తిరిగింది. తమిళనాడు డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ ఫిర్యాదు మేరకు డీఎంకే అధ్యక్షులు ఎంకే.స్టాలిన్ అల్లుడి శబరీశన్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. చెన్నై క్రైమ్ బ్రాంచి పోలీసులు కేసు పెట్టారు. అయితే ఈ కేసులో తన కుమారుడు ఉన్నాడంటూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. ఈ దుష్ప్రచారం వెనక శబరీశన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలక సూత్రధారి అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు నాగరాజన్ అని విన్నాం. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అప్రమత్తమన పార్టీ నాయకత్వం నాగరాజన్ ను సస్పెండ్ చేసింది. పొల్లాచ్చి ముఠా కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదివే అందమైన అమ్మాయిలను బుట్టలో వేసుకునేందుకు ఫేస్ బుక్ ను ఉపయోగించుకున్నది. ప్రేమిస్తాం, పెళ్లి చేసుకుంటాం అని నటించి వారితో శారీరకంగా దగ్గరయ్యేవారు. ఇదంతా వీడియో తీసి వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ తమ వాంఛలు తీర్చుకున్నారు. ఇలా సుమారు 200 మందికి పైగా యువతులు వీరి బారినపడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే రాకెట్ వెనకా అదృశ్య శక్తులు ఉన్నాయని, సినీ, రాజకీయ ప్రముఖుల కుమారులు ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ విచారణ ఆదేశించింది కూడా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa