కోల్‌కతా నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంధన సమస్య తలెత్తడంతో, పైలట్లు అత్యవసరంగా వారణాసిలోని లాల్ బహుదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో ఇంధనం లీక్ అయినట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa