వనదుర్గాపురం పరిధి చలమరాజుడ్లు గ్రామంలో ఆదివారం జరిగిన పెళ్లి విందులో భోజనం చేసిన సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. పెళ్లికి హాజరైన వారు భోజనం తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైద్యులు జయకుమార్, సీహెచ్ సుబ్రహ్మణ్యంలు స్పందించి, స్థానిక పాఠశాలలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేసి, బాధితులకు చికిత్స అందించారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa