రూ.26 కోట్ల నెక్లెస్ రోడ్డు పనుల అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. నెల్లూరులో పర్యటిస్తూ సిమెంటు రోడ్డు పగుళ్లు, దెబ్బతిన్న ఘాట్లను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్రమాలపై విచారణ జరిపి, గుత్తేదారు, అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి అక్రమాలు ఉన్నట్లు తేలితే పనులను రద్దు చేస్తామన్నారు. చేసిన పనులకు బిల్లుల చెల్లింపు లేదన్నారు.