విజయవాడలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా నేతలు హాజరయ్యారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన వర్ల రామయ్యను ఈ సందర్భంగాజిల్లా నేతలు సన్మానించారు. ఈ నెల 14న చంద్రబాబు తలపెట్టిన దీక్ష ఏర్పాట్లపై నేతలు సమావేశంలో చర్చించారు. విజయవాడ మున్సిపల్ స్టేడియం, స్వరాజ్య మైదానం వేదికలపై చర్చించారు. మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని టీడీపీ బృందం సీపీని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa