గువాహటి: యావత్తు దేశం 71వ గణంత్ర వేడుకలకు జరుపుకొంటుండగా.. అసోంలో జరిగిన గ్రనేడ్ పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం అసోంలోని దిబ్రూగఢ్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో స్వల్ప స్థాయి పేలుళ్లు సంభవించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇది నిషేధిత తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అసోం-ఇండిపెండెంట్’(యూఎల్‌ఎఫ్‌ఏ-ఐ) పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకల్ని బహిష్కరించాలని ఈ సంస్థ శనివారం పిలుపునిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య భారత్‌లోని పలు తీవ్రవాద సంస్థలు గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బహిష్కరణకు పిలుపునిస్తూ వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa