శాసన మండలిని కొనసాగించాలా రద్దు చేయాలా అన్న ఆలోచనలో వైసీపీ ఉంది. నేడు ఆ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మొత్తానికి పదవి పోగొట్టుకోవడం కంటే వైసీపీ వైపు వెళ్తే కనీసం పదవి అయినా ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నారట . అందుకే ఇలాంటి గోడ దూకేవారిపై చంద్రబాబు కంగారుగా ఉన్నారు. అందుకే ముందుగానే వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు . తమ పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు , పదవులు ఎరవేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
అంతే కాదు .. తమ పార్టీ ఎమ్మెల్సీలను కాపాడుకునే బాధ్యతను సీనియర్ నేతలు యనమల, అచ్చెన్నకు అప్పగించారట చంద్రబాబు . ఇప్పుడు వారిద్దరూ తంటాలు పడుతున్నారు . తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీ లతో కొందరు మంత్రులు, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని , డబ్బు , పద వులు ఎర వేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది . ఇందుకు డైరెక్టుగా పేరు చెప్పకుండా ఓ ఉదాహరణ కూడా చెబుతోంది .
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్సీతో వైకాపా నేతలు మాట్లాడారట .. పార్టీ లోకి వస్తే రూ .5 కోట్లు , మండలిలో ప్రభుత్వ విప్ పదవి ఇస్తామని ఆశ పెట్టారట . వచ్చే ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన కుటుంబానికి చెందిన వారికే అవకాశమిస్తామని చెప్పారట. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల పత్రికే బయటపెట్టింది కూడా. ఆయనలాగే మరికొందరు ఎమ్మెల్సీల తోనూ మాట్లాడే బాధ్యతను వైసీపీ కొందరు మంత్రులకు అప్పగించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు . తమ ఎమ్మెల్సీలెవరూ జారిపోకుండా టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది . చంద్రబాబే ఎమ్మెల్సీలతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి బుజ్జగిస్తున్నారట . ఎమ్మెల్సీలతో నిరంతరం మాట్లాడి , పార్టీ వెంట నిలబడేలా చూసే బాధ్యతను శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, శాసనసభలో తెదేపాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడులకు అప్పగించారు . మరి వీరు ఏమేరకు సక్సస్ అవుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa