ముఖ్యంగా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కరోనా వలలో చిక్కుకుపోయింది. ప్రస్తుతానికి ఐపీఎల్ వాయిదా పడింది, తర్వాత మళ్లీ నిర్వహిస్తారా.లేక అసలుకే నిర్వహించారా అనేది తెలియడం లేదు, ఒకవేళ ఐపీఎల్ ఆగిపోతే దాదాపు 10 వేల కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది నిపుణులు అంచనా వేస్తున్నారు,ఐపీఎల్ అంటే హంగామా కాసుల వర్షం కురిపించే ఆట ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ లీడ్. మరి అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి జరుగుతుందా జరగదా, కరోనా ఎఫెక్ట్ వలన కొనసాగుతుందా అనే సందేహంగ ఉంది. ఇప్పటికే వాయిదా వేసిన తర్వాత కూడా టోర్నీ జరగకపోతే పరిస్థితి ఏంటి అని ఆందోళన నిర్వాహకుడు వెంటాడుతోంది. అదే జరిగితే ఫ్రాంచైజీలు స్పాన్సర్ లకు నష్టం కోట్లలో ఉండబోతోంది. ఇప్పటికే ఆర్థికమాంద్యం దెబ్బకు ఐపీఎల్ లో ప్రైజ్ మనీ కూడా తగ్గించారు. ఇప్పుడు కరుణ ఎఫెక్ట్ కూడా పడితే అంతే సంగతులు అని అంటున్నారు క్రికెట్ పండితులు. ఐపీఎల్ జరగకపోతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అందుకే ప్రేక్షకులు లేకపోయినా కాళీ స్టేడియం లో నైనా ఆడించాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు ఎందుకంటే. ఐపీఎల్ రద్దయితే స్పాన్సర్షిప్ మీడియా రైట్స్ ఫ్రాంఛైజీల ఆదాయం ఆటగాళ్ళ ఫీజుల రూపంలో ఐపీఎల్ నష్టం 10 వేల కోట్లు గా ఉంటుందని అంచనా.ఫ్రాంచైజీలు, ప్రసార దారులు,బీసీసీఐలు ఐపీఎల్లో కీలక స్టేక్ హోల్డర్లు. ఐపీఎల్ ను వాయిదా వేయడం వల్ల ప్రధానంగా వీరికి ఎక్కువ నష్టం కలుగుతుంది.ఫ్రాంచైజీలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రకటనలు, టికెట్ల విక్రయం, ద్వారా రాబడి వస్తుంది, కానీకాళీ స్టేడియంలో మ్యాచ్లను నిర్వహిస్తే.టికెట్ల మర్చంట్ ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది,ఆ నష్టం ఒక్కొక్క జట్టుకు 20నుండి 40 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. టోర్నీ మొత్తం రద్దయితే ఒక్కో ఫ్రాంచైజీకి.150 నుండి 200 కోట్ల నష్టం వస్తుందని నిపుణులు అంటున్నారు.ఒకవేళ ఐపీఎల్ రద్దు అయితే బీసీసీఐ 200 కోట్లు రెవెన్యూ కోల్పోతుంది. ప్రచారకర్త స్టార్ స్పోర్ట్స్ నుండి ప్రతి ఏడాదీ బోర్డు 3000 వేల కోట్లు పొందుతుంది. దీనిని ఫ్రాంఛైజీల తో కలిసి 50/50 గా పంచుకుంటుంది. టైటిల్ స్పాన్సర్ వివో నుండి ఏడాదికి 500 కోట్లు అందుతుంది. ఇక ఆయా ఫ్రాంఛైజీలు తమకున్న స్పాన్సర్ ల సంఖ్యను బట్టి 35 నుంచి 75 కోట్ల రూపాయల మేర నష్టపోతాయి. గత ఏడాది ఐపిఎల్ బ్రాండ్ విలువ 47000 వేల కోట్లు అది ఇప్పుడు 50000 కోట్లకు చేరుకుంది, భారతదేశ జి డి పి కి ఏటా సరాసరి 2500 కోట్లు అందిస్తుంది. మౌలిక సదుపాయాలు,ప్రయాణాలు, ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్, ఆహారం ఇలా అనేక రంగాలపై పడుతుంది. 2009లో దక్షిణాఫ్రికాలో ఈ లీడ్ నిర్వహిస్తే 22000 స్టార్ హోటల్స్ లో బుక్ అయ్యాయి. అలాగే 10000 విదేశీయ విమాన టికెట్లు బుక్ అయ్యాయి,2014 లో 20 మ్యాచ్ లను...దుబాయ్ లో నిర్వర్తిస్తే అక్కడి ఆర్థిక వ్యవస్థలోకి ఏకంగా 275 మిలియన్ల దిర్వా మ్స్ ప్రవహించాలంటే ఐపీఎల్ డిలీట్ సత్తా ఏంటో అర్థమవుతుంది. ఐపీఎల్ పై స్టార్ హోటల్స్, విమానాలతో పాటు ఇతర సిబ్బంది కూడా ఆధారపడి ఉంది. అన్ని జట్లు తమ ఆటగాళ్ల రవాణా వసతి కోసం 5 కోట్లు ఖర్చు చేస్తురు. ఇలా అన్ని జట్లు కలిపి కనీసం 600 మందిని వివిధ పనుల కోసం నియమించుకుంటారు. దీనికొరకు కనీసం 10 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు వారి ఆదాయనికి కూడా గండి పడినట్లే. కానీ విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడానికి ఫ్రాంచైజీలు. ఇబ్బందిగా భావిస్తున్నాయి, ఐపీఎల్లో దాదాపుగా 60 మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడాల్సింది వాణిజ్య వీసాలు రద్దు చేయడంతో ఏప్రిల్ 15 వరకు మీరు భారత్ కు రాలేదు అప్పటికి కరుణ వ్యాప్తి తగ్గకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేస్తారే తప్ప సడలించరు....ఐపీఎల్ వేతనాలు 46 శాతం విదేశీ ఆటగాళ్లకు చెల్లిస్తున్నారు. ఇప్పుడు వీరి మ్యాచ్ ఫీజుల పరిస్థితి ఏంటి అన్నది కూడా అర్థం కాక ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa