హైదరాబాద్: అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమంత, నాగచైతన్య వివాహం అక్టోబర్ 6న గోవాలో జరగబోతోంది. అయితే అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నట్లు చిత్రవర్గాల సమాచారం. ఈ వివాహానికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. క్రైస్తవ, హిందూ సంప్రదాయంలో ఈ వివాహం జరగనుంది.వివాహం అనంతరం చైతన్య, సమంత 40 రోజుల పాటు హనీమూన్‌కి న్యూయార్క్‌కి వెళ్లనున్నట్లు మీడియా వర్గాల సమాచారం. పెళ్లి తేదీలోపు చైతన్య, సమంత తమ సినిమా ప్రాజెక్ట్‌లన్నీ పూర్తిచేయనున్నారు. జనవరిలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa