ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌, మస్కట్‌, కువైట్‌లకు విమానాలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 31, 2021, 12:55 PM

విజయవాడ నుంచి విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్‌.. ఇకపై బెజవాడ నుంచి మస్కట్‌లాంటి దేశాలకు వెళ్లాలంటే చెన్నై లేదా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరలేదు. నేరుగా విజయవాడ నుంచి విదేశాల్లో వాలిపోవచ్చు. ఈ క్రమంలోనే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌, కువైట్‌, సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.


ఇందులో భాగంగానే జూన్ 1,2 తేదీల్లో ఈ సర్వీసుల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఈ దేశాలకు విమాన సర్వీసులను నడపడానికి ఆసక్తి కనబరుస్తూ. స్లాట్ కోరాయి. దీంతో షెడ్యూల్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారులు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే అతర్జాతీయ విమానాలను నడిపే క్రమంలో.. గత నెల రోజులుగా విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్‌ను విస్తరిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.. ఈ నేపథ్యంలో ఒకేసారి మూడు అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కానుండటం విశేషం. గతంలో విజయవాడ నుంచి సింగపూర్‌కు వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ " వీజీఎఫ్‌ " విధానంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడిపింది. అప్పుడు ఆ సర్వీసుకు 98 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa