దేశంలో అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గనులు తవ్వకానికి అనుమతులు దక్కించుకుంది ఓ ప్రైవేటు సంస్థ. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు సిద్ధం అవుతుంది ఇండో ఆస్ట్రేలియన్ కంపెనీ.. ఆస్ట్రేలియన్ ఇండియన్ రిసోర్స్ లిమిటెడ్ "AIRL". బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించిన సంస్థ.. దీనిపై పూర్తిస్ధాయిలో పరిశోధన సాగించింది. జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఎక్కవగా ఉన్నట్లు గుర్తించింది. 2005లోనే ఈప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం ఆసంస్ధ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మైనింగ్ లీజులు, పర్యావరణ అనుమతుల కోసం తీవ్రమైన జాప్యం చేసుకోవటంతో ప్రాజెక్టు అనుమతులు ఆలస్యమయ్యాయి.
ఈ ప్రాజెక్టుకోసం 1500 ఎకరాలు అవసరం ఉండగా.. ఇందులో 350 ఎకరాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. మరో 1150 ఎకరాలను లీజు క్రింద కంపెనీ తీసుకోనుంది. ఈ తొలిబ్లాక్‌లో ముందుగా బంగారు గనుల తవ్వకం ప్రారంభించిన తర్వాత మరో మూడు బ్లాక్ ల్లో మైనింగ్ చేయాలని AIRL సంస్థ నిర్ణయించింది. మొత్తం నాలుగు బ్లాకులు కలిపి సుమారుగా 30 నుండి 40 టన్నుల బంగారు నిక్షేపాలను వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. సందరు సంస్ధ ప్రతిఏటా 750 కేజీల బంగారం తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం AIRL సంస్ధకు పూర్తిస్ధాయి అనుమతులు వచ్చినందున త్వరలో బంగారు గనుల తవ్వకాలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2020 సంవత్సరంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనుమతులు లేటు కావవటం, కోవిడ్ కారణంగా వాయిదా పడింది.
2022 ఏప్రిల్ తరువాత బంగారు గనుల తవ్వకం చేపట్టేందుకు AIRL సంస్ధ సిద్ధమౌతుంది. కర్నూలు జిల్లా జొన్నాడ పేరు గతకొద్దిరోజులుగా దేశంలో మార్మోగిపోతుంది. ఇటీవలకాలంలో అక్కడ పొలాల్లో స్ధానికులకు వజ్రాలు లభిస్తుండటం వాటి విలువ కోట్లల్లో పలుకుతుండటంతో జొన్నగిరి ప్రాంతం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. బంగరు గనుల తవ్వకాలు త్వరలో జరగనుండగా ఈ ప్రాంతం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa