APPSC 2018 గ్రూప్-1 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేసే ప్రక్రియలో ఉంది. గ్రూప్-1 మెయిన్స్ డిజిటల్ ప్రొసీజర్ ద్వారా మూల్యాంకనం నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని ఆరోపిస్తూ 2018 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు డిజిటల్ ఫలితాలను నిలిపివేసింది. ఈసారి మూల్యాంకన ప్రక్రియ సక్రమంగా జరగలేదని, మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో త్వరలో మూల్యాంకనం పూర్తి చేసి ఫిబ్రవరి నెలలో ఫలితాలు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ ఆంజనేయులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa