అనంతపురం జిల్లా: అమడగూరు మండలంలోని పేదవారు ఆనారోగ్యానికి గురైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటుంటారు. పేదవారు ఆనారోగ్యం బారినపడితే చికిత్స కోసం రెండు మార్గాలను అనుసరిస్తుంటారు.
మొదటిది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవడం, సిబ్బంది ఎవరు లేకపోతే వచ్చిన రోగులు ఎక్కడికి పోవాలో దిక్కుతోచక వెనుతిరిగి వెళ్లిపోవటం. అయితే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పనితీరు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వైద్య అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తూ మధ్యాహ్నం 12 గంటలకే ఆసుపత్రి మూతవేయ్యడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వైద్యాధికారిని మోనా తోపాటు, కొంతమంది సిబ్బంది కూడా శనివారం విధులకు హాజరుకాలేదని రోగులు చెబుతున్నారు. అయితే వైద్యాధికారిని మోనా గారు మొత్తం సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యారని అబద్దాలు చెబుతు నిత్యం వారానికి మూడు నాలుగు రోజులు విధులకు డుమ్మా కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
శనివారం మండలంలోని వివిధ గ్రామాల నుండి వైద్య చికిత్సలు కోసం రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మధ్యాహ్ననానికే ఆసుపత్రి మూతపడటంతో రోగులు ఏమి చేయాలో దిక్కు తోచక, ప్రవేటు వైద్యం తీసుకొనుటకు తగిన ఆర్థిక స్తోమత లేక ముక్కుతూ మూలుగుతూ స్వగృహాలకు వెనుదిరిగారు. గ్రామీణ ప్రజలు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు ఖర్చు పెట్టి మండలకేంద్రంలో ఆరు పడకల ఆసుపత్రిని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో వుండే విధంగా వైద్య సిబ్బందిని కూడా నియమించి నిర్మించారు.
గ్రామీణ ప్రాంతాలలో వైద్యం ప్రతి పేదవానికి అందుతుందని ఎంతో ఆశతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆస్పత్రి నిర్మిస్తే సిబ్బంది ఎస్కేప్ పుణ్యమాని మొత్తం ఆసుపత్రికి తాళాలు వేసి ఇంటి ముఖం పట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు, మహిళలు ప్రసవాలు ఏ సమయంలోనైనా జరుగవచ్చనే భావనతో ప్రభుత్వం సిబ్బందిని అందుబాటులో ఉండాలనే స్పష్టమైన ఆదేశాలను చేస్తున్నప్పటికీ, ఆసుపత్రి 12 గంటలకే తాళం వేయడంతో వివిధ సమస్యలతో వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడి ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్లిపోయారు.
సందెట్లో సడేమియాగా ఆర్. ఎం. పీ. డాక్టర్లు వారికి దొరికినంత దోచేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ లోకి అడుగు పెట్టాలంటేనే హడాలితున్నారని స్థానికులు వాపోతున్నారు. మహిళలు ప్రసవాలు చేయాలి అంటే ప్రైవేట్ ఆస్పత్రిలో వేలకు వేలు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రిలో వేలకు వేలు కట్టలేక ప్రాణాలనే పోగొట్టుకున్న పరిస్థితులు పలు సందర్భాలు మండలంలో నెలకొన్నాయి. ఇక్కడ వైద్య సిబ్బంది సమయపాలన పాటించకుండా సక్రమంగా విధులు నిర్వహించలేదని బహిరంగంగానే మండల ప్రజలు వాపోతున్నారు.
ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు అన్నరీతిలో సిబ్బంది వైఖరి నెలకొంది. ఏదో వచ్చామా వెళ్ళామా అంటూ నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండల ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అమడగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత జరుగుతున్న జిల్లా ఉన్నత వైద్యాధికారులు స్పందించకపోవడంతో మండల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో మండల ప్రజలకు తగిన చికిత్సలు, సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఆసుపత్రి మూసేసి మధ్యాంతరంగా విధులకు డుమ్మా కొట్టి వెళ్లిపోవడం ఏంటని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి గ్రామానికి వైద్య కేంద్రం ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు ఆచరణలో ముందుకు సాగడం లేదని అంటున్నారు. వైద్యాధికారులకు, సిబ్బందికి లక్షలాది రూపాయల జీతాలు వెచ్చిస్తున్నప్పటికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం మాత్రం అందకపోవడం భాదకరమని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇలా ప్రభుత్వ సొమ్మును లక్షలాది రూపాయలు నెలనెల జీతాల రూపంలో దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకు వైద్యం అందకపోవడం ప్రజలను, రోగులను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నత వైద్య అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పనితీరును పరిశీలించి మండల ప్రజలకు అందుబాటులో వుండేలా వైద్య సిబ్బందిని గాడిలో పెట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
వైద్య అధికారి, మోనా ని వివరణ కోరగా ప్రభుత్వ ఆసుపత్రి 12 గంటలకే మూత పడిన విషయాన్ని మండల వైద్యాధికారి మోనాని వివరణ కోరగా రెండవ శనివారం కావడంతో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఆసుపత్రి తలుపులు తెరిచి వుంటుందన్నారు. సిబ్బంది అందరూ కూడా విధులకు వచ్చారని ఆమె అన్నారు.
డిప్యూటీ డియం అండ్ హెచ్ ఓ ఐనుద్దీన్ ని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ రెండవ శనివారం మెడికల్ ఆఫీసర్ గారికి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపిలో వుండాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సాయంత్రం 4 గంటల వరకు తలుపులు తెరిచి వుండాలి కానీ తలుపులు మూసివేసి వెల్లిపోకుడదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa