చిత్తూరు: బంగారం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు గత ఏడాది డిసెంబరులో నకిలీ బంగారం విక్రయించి ప్రజలను మోసం చేసిన సంఘటనపై గుర్రంకొండ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్రంకొండ -రాయచోటి మార్గంలో నిఘా ఉంచారు. కలకడ క్రాస్ ఈశ్వరుడి గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కడప జిల్లా వీరబల్లి గ్రామం షికారిపాళెంకు చెందిన పొమర్ సుజిరెడ్డి అలియాస్ శివయ్య ( 20), రానా శివయ్య ( 19 ), గోవిందు శ్రీనివాసులు ( 28 ), గోవింద్ కళ్యాణ్ నాయక్ ( 23 ) రాణాసాయి ( 20 ) ను అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా నకిలీ బంగారం కేసులో నిందితులని తేలింది. వారి నుంచి రూ. 8 లక్షలు నగదు, నకిలీ బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండు నిమిత్తం కోర్టుకు తరలించారు. నెలరోజుల్లోనే కేసును ఛేదించిన గుర్రంకొండ పోలీసులను డీఎస్పీ రవిమనోహరాచారి అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్ఐ హరిహరప్రసాద్, పోలీసు సిబ్బంది రమణ, నాగరాజు, రాఘవరెడ్డి, ఫామీన్ఆరాష్, హర్ష, దొరబాబు, శ్రీనాథ, వేణు, సతీష్ కుమార్, అర్జున్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa