ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో కీచకపర్వం వెలుగుచూసింది. ఓ విద్యార్థినిపై సహ విద్యార్థులు అత్యాచార యత్నం చేశారు. ఆ దుర్మార్గాన్ని వారు సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను కనిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని శివానగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్‌ఫోన్ లో వీడియో తీసి ఆ దృశ్యాలను వాట్సాప్ లో వారి స్నేహితులతో పంచుకున్నారు. విద్యార్థుల్లో ఒకరు బీటెక్ చదువుతుండగా.. మరో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు యువతుల్లో ఒకరు తప్పించుకోగా మరో యువతి తప్పించుకునేందుకు అవకాశం లేక విద్యార్థుల చేతిలో అత్యాచారయత్నానికి గురైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa