ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజెండా మార్పుకు ఆ నలుగురే కారణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 12:57 PM

ఏపీకి ప్రత్యేక హోదా అజెండా మార్పునకు తెరచాటుగా ఆ నలుగురే కారణమని టీడీపీ, బీజేపీ నేతలపై వైసీపీ నేత జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. ఏపీ, తెలంగాణ విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ... అజెండా మార్పు వెనుక నలుగురు వ్యక్తులు ఉన్నారని అన్నారు. చంద్రబాబు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావులు అజెండా మార్పుకు కారణమని... వీరంతా ఏపీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పారు. ఈ నలుగురు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అజెండాను మార్పించారని ఆరోపించారు. అజెండాలో ప్రత్యేకహోదా అంశం లేదని జీవీఎల్ ప్రకటించారని అన్నారు.   ముఖ్యమంత్రి జగన్ వల్లే ప్రత్యేకహోదా సాధ్యమని అన్నారు. త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేకహోదాను చేర్చి, మళ్లీ తొలగించడం దారుణమని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 17న కేంద్ర కమిటీ సమావేశం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa