ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎస్ఎల్వీ సీ-52 కౌంట్ డౌన్ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 12:58 PM

ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పీఎస్ఎల్వీ సీ-52 ని పరీక్షించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. రేపు ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. పీఎస్ఎల్వీ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐఆర్ శాట్ 1ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు రూపొందించిన ఇన్ స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa