మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం శ్రీరామానగర్ లో వేంచేసియున్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషి స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో స్వామివార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఆయా కూడళ్లలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa