ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఎదురు దెబ్బలు తట్టుకోలేని రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ దేశంలోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎంతో అందమైన ప్రదేశాలను స్మశానంలా మారుస్తోంది. ఈ క్రమంలో తమ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు. దీనిపై పుతిన్ ఘాటుగా స్పందించారు. ఏ దేశమైనా అలా చేస్తే రష్యాపై యుద్ధం ప్రకటించినట్లేనని తీవ్రంగా హెచ్చరించారు. శనివారం 5 గంటల పాటు కాల్పల విరామం ప్రకటించిన రష్యా అనంతరం బాంబుల మోతతో విరుచుకుపడుతోంది. ఆదివారం కూడా క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడితో ఉక్రెయిన్‌ను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ దాడుల కారణంగా సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పదుల సంఖ్యలో చిన్నారులు కూడా కన్ను మూశారు. ఈ రెండు దేశాల మధ్య సామరస్యక వాతావరణం ఏర్పడి యుద్ధం ముగియాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa