ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం నిధులు స్వాహా చేసి దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోయాడు. చర్యలు తీసుకోవాల్సిన తెనాలి మున్సిపల్ అధికారులు విచారణ కమిటీ పేరుతో నిందితుడిని రక్షించడానికి యత్నిస్తున్నారని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెనాలి కొత్తపేట లోని రవి సాంబయ్య మున్సిపల్ బాలురోన్నత పాఠశాల, మారీసుపేట లోని నల్లమోతు చెంచు రామానాయుడు హైస్కూల్, ఐతానగర్ ఎన్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ను ఎంపిక చేసింది.
ఒక్కో పాఠశాలకు రూ. 12 లక్షల నిధులు కేటాయించింది. ఐతానగర్ ఎస్ ఎస్ ఎమ్ మున్సిపల్ హై స్కూల్ కి 2020 డిసెంబర్ లో నిధులు జమయ్యాయి. అప్పటి పాఠశాల హెచ్ఎం గా ఉన్న తావురయ్య ల్యాబ్ నిర్మాణం కోసం గదిని ఏర్పాటు చేసి రూ. 9లక్షల మేర నిధులు డ్రా చేసుకొని లాంగ్ లివ్ పై వెళ్లిపోయాడు.
నిధులు దుర్వినియోగం జరిగిన విషయం గుర్తించిన పాఠశాల పేరెంట్స్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ దానికి సరైన స్పందన లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ స్పందించి బాధితులపై చర్య తీసుకొని పాఠశాలలో సైన్స్ లాబ్ ఏర్పాటుకు కృషి జరపాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ డిమాండ్ చేస్తుంది.