భారతదేశంలో, టీకా యొక్క ప్రాముఖ్యతను మొత్తం దేశానికి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం మార్చి 16వ జాతీయ లేదా దినోత్సవంగా నిర్వహి స్తారు. భారత ప్రభుత్వం 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కావన్ 19 టీకాను సీనియర్ సిటిజన్లకు బూస్టర్ డోసు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో బుధవారం నాడు గడివేముల మండల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రభుత్వ వైద్యాధికారి ఆధ్వర్యంలో 12 నుండి 14 సంవత్సరాలు నిండిన 20 మంది బాలబాలికలకు కర్బేవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు ప్రభుత్వ వైద్య అధికారి వృజన తెలిపారు. ఈ వ్యాక్సిన్ వల్ల బాలబాలికలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ ఎన్. నిర్మల పి హెచ్ ఓ ఉషారాణి ఆశా వర్కర్లు పాల్గొన్నారు.