కాంగ్రెస్ లోని జీ-23 నేతలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో G-23నేతలు మరోసారి అధిష్ఠానంపై విమర్శల దాడి చేయడాన్ని.ఆయన తీవ్రంగా ఖండించారు. CWC భేటీలో అన్నిఅంశాలపై చర్చించి, పార్టీ బలోపేతానికి మార్పులు చేయాలని నిర్ణయించాక నేతలు సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. ఇలాంటి భేటీలు వంద నిర్వహించినా గల్లీ నుంచి దిల్లీదాకా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వెంటే ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ బలహీనపర్చలేరని మల్లిఖార్జున ఖర్గే స్పష్టంచేశారు.