జమ్ముకశ్మీర్ అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన-సౌభాగ్య పథకం కింద వందశాతం గ్రామాలను. విద్యుదీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విద్యుత్ సౌకర్యం లేని 3లక్షల 57వేల 405 ఇళ్లల్లో విద్యుత్ కాంతులు నింపినట్లు అధికారులు తెలిపారు.కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సకాలంలో చేరుకున్నందుకు గాను బహుమతిగా..100కోట్ల రివార్డును సైతం జమ్ముకశ్మీర్ పొందినట్లు వివరించారు. షోపియాన్ జిల్లా కెల్లార్ ప్రాంత గ్రామాలు.ఒకప్పుడు విద్యుత్ గురించి ఎరుగవన్న అధికారులు సౌభాగ్య పథకం అక్కడి ఇళ్లల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు.