భారత రైల్వే వ్యవస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు. కేంద్రం రైల్వేను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని.. లోక్ సభలో రైల్వేశాఖ కేటాయింపులపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి. రైల్వేను ప్రైవేటుపరం చేయడమనేది కేవలం ప్రతిపక్షాల ఊహాజనిత ఆలోచనేనని మంత్రి అన్నారు. రైల్వేలో ట్రాక్ లు, స్టేషన్ లు, రైలుఇంజిన్ లు, బోగీలు అన్నీ ప్రభుత్వ ఆస్తులేనని... రైల్వేను ప్రైవేటుపరం చేసే ఆలోచనే లేదని మంత్రి స్పష్టం చేశారు. రైల్వేశాఖలో ఉద్యోగ నియామకాలపై ఎటువంటి నిషేధం లేదన్న ఆయన..... 1.4 లక్షల పోస్టులభర్తికీ ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు.... పార్లమెంట్ ఉభయసభలు మార్చి 21కి వాయిదా పడ్డాయి. హోలీ, వారాంతపు సెలవులతో కలిపి నాలుగు రోజులు పార్లమెంటుకు సెలవు ప్రకటించారు.