ఓడీసి మండల పరిధిలోని యం. కొత్తపల్లి, వడ్డివారిపల్లి గ్రామాలకు చెందిన వ్యవసాయ మోటర్ల కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దొంగలించినట్లు సంబంధిత రైతులు తెలిపారు.
గత రెండు మాసాల క్రితం పదిహేను మోటర్లకు సంబంధించిన కేబుల్ వైర్లను దొంగిలించడం జరిగిందని, కొద్దిరోజుల విరామంతో మంగళ , బుధ వారం రాత్రి మరోసారి వడ్డివారిపల్లికి చెందిన ఉత్తారెడ్డి, యం. కొత్తపల్లికి చెందిన అంజనరెడ్డిల కు చెందిన వ్యవసాయ మోటర్లకు సంబంధించిన కేబుల్ చోరీ చెయ్యడం జరిగిందని వారు తెలిపారు. పోలీసులు తక్షణం తగు చర్యలు చేపట్టి దొంగల ఆగడాలకు కళ్లెం వేయ్యాలని రైతుసోదరులు విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.