పోలీసులు, TTD విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని TTD మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.
CM చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.