రాజ్యాంగ పరిరక్షణకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకుడు బండారు పోతలయ్య పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రిలో మందకృష్ణ మాదిగతో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేప ట్టినట్లు చెప్పారు. మాదిగలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు గురుశంకర్, భీమలింగ, నరసింహులు, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.