విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజును ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి కలిశారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వాటి పురోగతి, ఇసుక డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఇసుక డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి ఆధికారులతో మాట్లడి డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని అదేశించినట్లు ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి తెలిపారు.