ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వసూళ్ల దిశగా 'కలంకావల్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 02:47 PM

మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో 'కలంకావల్' ముందు వరుసలో కనిపిస్తుంది. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి జితిన్ కె జోస్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మమ్ముట్టి నటన గురించి మరోసారి అంతా మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలైన 17 రోజులలోనే 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఏ దడి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఇది ఒకటిగా నిలిచింది. మమ్ముట్టి కెరియర్లో చాలా వేగంగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాగా కూడా ఒక కొత్తరికార్డును ఈ సినిమా దక్కించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో ఈ సినిమా 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ కానుంది.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa