సూర్య కథానాయకుడిగా తమిళంలో 'తానా సెరిందా కూట్టమ్' చిత్రం రూపొందుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా విడుదలకు సిద్దమయ్యింది...సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌లో సూర్య, కీర్తి సురేష్ నటనతో పాటు రమ్యకృష్ణ నటన హైలెట్ కానుందనే విషయం టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. హీరో సూర్య ఇప్పటి వరకు చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నారని సమాచారం.
ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.తెలుగు ఆడియన్స్ లోను సూర్యకి మంచి క్రేజ్ వుంది. అయితే కొంత కాలంగా ఇక్కడి నుంచి ఆయనకి సరైన హిట్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండాగా టాలీవుడ్ స్టార్స్ కి పోటీగా వస్తన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..మరీ ముఖ్యంగా ఈ టీజర్ చూసిన వారంతా రమ్యకృష్ణ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేసిన సీన్ గురించే మాట్లాడుకుంటుండటం విశేషం. బాహుబలి సినిమాలో శివగామిగా రాజమాత పాత్రలో హుందాగా కనిపించిన రమ్యకృష్ణ ఇలా లుంగీ కట్టి హీరో సూర్యతో డ్యాన్స్ చేయడం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa