సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. ఆయన ఏమి చేసినా ఒక సెన్సేషనే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాజకీయాన్ని నాటకీయంగా మార్చిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో కులాల మీద సాంగ్ రిలీజ్ చేసి పెద్ద రచ్చ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రతో పాటు చంద్రబాబు నాయుడు సంబంధించిన గెటప్‌ను రిలీజ్ చేసి ఔరా అనిపించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ రిలీజ్ చేసాడు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర చేస్తున్న క్యారెక్టర్.. ఒక రాజకీయ సభలో విదేశీ డాన్సర్లతో ఉన్నట్టు ఫోటోను పోస్ట్ చేసాడు. అంతేకాదు ఈ పోస్టర్‌ను ఎవరినైనా పోలీ ఉంటే అది పూర్తిగా కో ఇన్సిడెంట్ అని ట్వీట్ చేసాడు. మరోవైపు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌ను దీపావళి కానుకగా ఆదివారం ఉదయం 9.36 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. మొత్తానికి తన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను మరోసారి వార్తల్లో నిలిపాడు.
A pic from KAMMA RAJYAMLO KADAPA REDDLU ..Trailer releasing dayafter 27 th with Diwali blessings at 9.36 Am .. Resemblence to any person is purely coincidental #KRKR pic.twitter.com/hGFVMkre2F
— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa