'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో దర్శకుడు వి.ఐ.ఆనంద్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తన తదుపరి చిత్రమైన 'ఒక్క క్షణం'తో ఈ నెల 28వ తేదీన ఆయన ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన అల్లు అర్జున్ తో చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' సినిమా చేసిన దర్శకుడు అని కన్నెగంటి, ఇటీవల అల్లు అర్జున్ ను కలిసి ఒక కథ చెప్పాడట. బన్నీకి ఆ కథ నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి కొనేశాడంటూ వార్తలు వచ్చాయి. తాను హీరోగా ఆ కథను తెరకెక్కించే బాధ్యతను ఆయన వి.ఐ.ఆనంద్ కి అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు దర్శకులకు బన్నీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉన్నప్పటికీ, 'నా పేరు సూర్య' తరువాత సినిమాను మాత్రం వి.ఐ.ఆనంద్ తోనే చేయనున్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa