బడా నిర్మాతలు మారుతికి అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేయడమే కాదు.. దర్శకుడు మారుతి కి ఏకంగా ఓ నిర్మాత ఆరు కోట్లు ఆఫర్ చేసినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డివివి దానయ్య తన కొడుకుతో సినిమా కోసం మారుతీ ని ఎవరూ ఎగరేసుకుపోకుండా.. 6 కోట్ల ఆఫర్ ఇచ్చి లాక్ చేసుకునే పనిలో ఉన్నాడని అంటున్నారు. కామెడీతో కూడిన కథతో ఫ్యామిలీస్ కి దగరైతే చాలని, ఇక మిగిలిన కాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా మారుతి పెత్తనానికి దానయ్య జై కొట్టబోతున్నాడంటున్నారు. మరి మారుతీ ఈ ఆఫర్ ని ఏం చేస్తాడో కానీ.. ప్రస్తుతం మరో బడా నిర్మాత దిల్ రాజు కూడా మారుతీ తో సినిమా చెయ్యడానికి సిద్ధమయ్యాడని న్యూస్ వింటుంటే.. మారుతీ వెంట పడుతున్న బడా నిర్మతలు అనేలా ఉంది వ్యవహారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa