బాలీవుడ్ దర్శకుడు అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `లాల్ సింగ్ చద్దా`. ఈ చిత్నాన్ని ఈ ఏడాది కిస్మస్‌కు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదే సమయానికి అక్షయ్‌కుమార్ `బచ్చన్ పాండే` చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు వస్తుందని భావించిన అమీర్ ఖాన్.. అక్షయ్‌కు ఫోన్ చేసిన మాట్లాడారు. దాంతో అక్షయ్ తన సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దీనిపై అమిర్ స్పందిస్తూ “ కొన్ని సమయాల్లో చిన్న మాటలే ప్రముఖంగా మారుతాయి. మా మిత్రుడు అక్షయ్ కుమార్, నిర్మాత సాజిద్ నడియడ్ వాలాకు థ్యాంక్స్. వారు బచ్చన్ పాండే సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. వారి సినిమాకు నా అభినందనలు అని అమీర్ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa