ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు వైజాగ్ లో 'జాను' ప్రీ రిలీజ్ ఈవెంట్!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2020, 06:08 PM

సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్ - సమంత జంటగా తెరకెక్కిన చిత్రం జాను. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకొని సినిమా ఫై అంచనాలు పెంచాయి. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధమవుతోంది. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైజాగ్ - ఎ.యు. సిరిపురంలోని 'సర్ సి ఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్' ఇందుకు వేదికగా మారనుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. అటు సమంత .. ఇటు శర్వానంద్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్ లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో వున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa