స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. పైగా నాన్ బాహుబలి రికార్డ్స్ ను కూడా కొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో బన్నీ టీమ్ చిత్ర బృందానికి అలాగే కొంతమంది సినీ ప్రముఖులకు పార్టీని ఏర్పాటు చేసింది. కాగా ఈ వేడుకకు సినిమా టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు లేటెస్ట్ డైరెక్టర్స్ లో చాలమంది ఈ సెలెబ్రేషన్స్ కు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి బన్నీ తాజాగా పోస్ట్ చేస్తూ.. లెజెండ్ డైరెక్టర్ నుండి లేటెస్ట్ డైరెక్టర్స్ వరకూ అని వారితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. అలాగే వారిని ఉద్దేశించి టెస్ట్ పోస్ట్ చేస్తూ.. ‘ఇంటికి వచ్చి మా వేడుకల్లో భాగమైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సెలెబ్రేషన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదే.. అయితే మీ రాకతో ఈ సెలెబ్రేషన్స్ ను నాకు మరింతగా గుర్తుండిపోయేలా చేశారు. మీ అందరికీ నా ధన్యవాదాలు’. అని బన్నీ మెసేజ్ చేశారు.
I whole heartedly Thank everyone for coming home and being a part of our celebrations. This one will always be the most special... thank you all for making it more memorable with your presence. Humbled. pic.twitter.com/Y4jZAobziY
— Allu Arjun (@alluarjun) February 3, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa